Saturday, December 12, 2015

పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు శత్రువులూ లెరు. మన మాట, మనస్తత్వం, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం.
మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, దొంగలతో పరిచయం, అసమర్థులతో వ్యాపారం, నచ్చని వ్యక్తితో వివాహం... చేయకూడని పనులు.
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచం లో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.

Sunday, September 20, 2015

బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే తటస్థంగా ఉన్నట్లు కాదు, బలవంతుడి పక్షం వహించినట్లు.
అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం - ఈ ఐదూ అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయపథంలో  ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరుకునేవారు ఒక్కరయినా ఉన్నారని ఆనందించు.

Sunday, August 23, 2015

కాఠిన్యం కంటే కరుణ మరింత సత్ఫలితాన్నిస్తుంది.

Sunday, August 9, 2015

నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చగాలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.

Sunday, August 2, 2015

తెలివిపరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ యజమానితోనూ మనకు ప్రియమైనవారితోనూ వాగ్వాదానికి దిగకూడదు.

Tuesday, July 28, 2015

సహనం, నమ్మకం ... మానవజాతి వివేకమంతా ఈ రెండు మాటలలోనే  దాగుంది.

Sunday, July 26, 2015

మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్నీ మార్చలేం.

Monday, July 13, 2015

అహంకారం ప్రతి ఒక్కరి నుంచీ - ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
ఆత్మీయులతో పంచుకుంటే బాధ సగమవుతుంది, ఆనందం రెట్టింపవుతుంది.

Tuesday, June 23, 2015

కళ్ళు తమని తాము నమ్ముతాయి. చెవులు ఇతరులను నమ్ముతాయి.

Sunday, June 14, 2015

అందలోనూ మంచినే చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైనవారు వేరొకరు లేరు.
నీ స్నేహితుడికి ఒక చేపను ఇవ్వు... ఈరోజు హాయిగా తింటాడు, అతనికి చేపలు పట్టడం నేర్పు... రోజూ హాయిగా ఉంటాడు.

Tuesday, June 2, 2015

ఆశించడం వల్ల కాక అర్హత సాధించడం వల్లనే దేన్నైనా పొందగలం.

Sunday, May 24, 2015

కాదనడం కంటే పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చెయ్యడమే ఎక్కువ అవమానకరం.

Sunday, May 17, 2015

నిప్పు, అప్పు, పగ - ఈ మూడూ తమంతట తాము తరగవు. పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ది చెందుతాయి.

Monday, May 11, 2015

ఒకటి రెండు లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగోట్టుకోకు. మానవత్వం అనేది మహా సముద్రం లాంటిది. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్ళు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు.

Monday, April 20, 2015

సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్దించదు, ఎడతెగని ప్రయత్నం కావలి.

Monday, April 13, 2015

కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయతీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.

Tuesday, April 7, 2015

ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్దపడతాడు. ఒకసారి నడత చేడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి.

Monday, March 30, 2015

కోపం మనల్నే నష్టపరుస్తుంది. తెలివి ఎదుటివాడిని నష్టపరుస్తుంది.

Tuesday, March 24, 2015

వివేకం గెలవలేనిచోట సహనం విజయాన్ని అందించవచ్చు.

Tuesday, March 17, 2015

సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తిసామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే.

Sunday, March 8, 2015

పశుబలమే శక్తికి చిహ్నమైతే మగవాడే బలవంతుడు. అలాకాక బలమన్నది నైతికమూ మానసికమూ అయితే నిస్సందేహంగా మహిళలే శక్తిమంతులు.

Thursday, March 5, 2015

తప్పు చేయడం దోషమైతే, దాన్ని ఒప్పుకోకపోవడం మరో దోషం. ఆ తప్పును మరొకరిఫైకి నెట్టడం మహా దోషం.
అందరినీ మెప్పించలేమ్, కానీ, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఒప్పించడం సులభం.

Tuesday, February 17, 2015

ప్రేమనూ పేదరికాన్నీ దాచాడంకన్నా ద్వేషాన్నీ సంపదనూ దాచడం తేలిక.

Sunday, February 8, 2015

'కృతజ్ఞత' చూపించవలసినదే కానీ ఆశించవలసినది కాదు.
స్వేచ్చా చొరవా లేనిచోట సత్ప్రవర్తనా సాహసం ఉండవు.

Monday, January 26, 2015

మనిషి తన కలలను పండించుకోవాలంటే ముందు కళ్ళు తెరవాలి.

Sunday, January 18, 2015

పెద్దపెద్ద ప్రణాలికలు తయారుచేస్తూ కూర్చోవడంకంటే చిన్న చిన్న పనులను పూర్తిచేసుకోవడం ఉత్తమం.

Monday, January 5, 2015

జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్దలేకపోవడం ఎక్కువ హానికరం.