Thursday, December 25, 2014

ఆపదలకు ప్రతిక్రియను ముందుగానే ఆలోచించుకోవాలి. ఇల్లు తగలబడుతున్నప్పుడు బావి తవ్వడానికి ప్రయత్నించడం తెలివితక్కువ పని.
మాటలకూ చేతలకూ తేడా ఉంటే మన మాటలను ఎవరూ విశ్వసించరు.
బాగుపడాలనుకునే  మనిషి  ... అతినిద్ర, సోమరితనం, పనిలో అలసత్వం, భయం, కోపం . . . అనే ఐదు దుర్గుణాలను వదుల్చుకోవాలి.
ఏ పోరాపాటూ చేయట్లేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నిం చాట్లేదన్నమాట .

Sunday, September 7, 2014

నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి.
ఫైవారితో గౌరవంగా సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువవారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
దేవాలయంలో విగ్రహంలోకాక నిరుపెదలలో బలహీనులలో ఆపన్నులలో భగవంతుడిని దర్శించేవారంటే దేవుడుకి ఇష్టం. సాటిమనిషికి సాయం చేయనివాడు భగవంతుడిని బంగారుపూలతో పూజించినా వ్యర్థమే.
కొత్త లక్ష్యాన్ని గానీ కొత్త కలనుగానీ ఆహ్వానించడానికి వయసు మీరడమంటూ ఉండదు.

Monday, June 23, 2014

మాటను మించిన మహా ఔషధం లేదు, మాటను మించిన మహా యుద్దమూ లేదు.

Thursday, June 19, 2014

నోరు జారిన మాట, చేయి జారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం.
మూసిన నోట్లోకి ఈగలు దూరవు. అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు.
అందరినీ అన్ని వేళలా సంతృప్తిపరచాలనుకుంటే ఓటమి తప్పదు.

Saturday, May 24, 2014

పులిగుహలో అడుగు పెట్టడానికి భయపడేవాడు పులి పిల్లలను పట్టుకోలేడు.

Saturday, May 3, 2014

కష్టాలు విజ్ఞతను పెంచుతాయి. తనవారెవరో పరాయివారెవరో తెలుపుతాయి.
బంగారు నాణేన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు, కానీ వందమంది మేధావులు కలిసి కుడా దాన్ని వెనక్కి తియ్యలేరు.
సమాజ సేవకు కావలసింది సంపద కాదు, ఉదార హృదయం.
మెరిసేదంతా బంగారం కానట్లే, మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు.

Monday, February 24, 2014

ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైనది గానే అనిపిస్తుంది.
అడుగునున్న ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు . . . రేపటి వంతు తనదే మరి.
రెండు కుందేళ్ళ వెనుక పరుగెత్తేవాడు దేన్నీ పట్టుకోలేడు.
ఎంత ఎత్తైన చెట్టు అయినా  గొడ్డలికి తల వంచాల్సిందే.

Tuesday, January 14, 2014

చావు బతుకులు ఎక్కడో లేవు.
ధైర్యం లోనే బతుకు ఉంది.
భయం లోనే చావు ఉంది.